సిరికొండ/డిచ్‌పల్లి: మండలాల్లో మహర్నవమి వేడుకలను సోమవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాహన యాజమానులు తమ వాహనాలను శుభ్రం చేసి పూలదండలతో అలంకరించారు. గుమ్మడి కాయలు కొట్టి పూజలు చేశారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ
నిజామాబాద్ రూరల్: నగరంలో విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వీహెచ్‌పీ అధ్యక్షుడు దినేష్‌ఠాకూర్ ఆధ్వర్యంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దసరా ముందు రోజు ఆయుధ పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు శాంతియుతంగా దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. వీహెచ్‌పీ సభ్యులు ధాత్రిక రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


