తీర్థయాత్రకు వెళ్లి అనంత లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రకు వెళ్లి అనంత లోకాలకు..

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివనగర్‌: తీర్థయాత్రకు వెళ్లి న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్సై పు ష్పరాజ్‌ తెలిపిన వివరాల ప్రకా రం.. సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌ గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి(45) అనే మహిళ రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయిలో ఉన్న బంధువులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్నవరం లో సేవ చేసేందుకు గత నెల 29న బయలుదేరి వెళ్లారు. తుని ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళల్లో సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌ గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి ఉన్నట్లు అక్కడి పోలీసులు సదాశివనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement