నిజామాబాద్ అర్బన్: నగరంలోని గాయత్రి నగర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ జరిగింది. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపిన వివ రాల ప్రకారం.. గాయత్రి నగర్‌కు చెందిన లింగంపల్లి విజయ పని నిమిత్తం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించా రు. బీరువాలో ఉన్న రూ. పదివేల నగదు, మూడు తులాల పుస్తెలతాడు, రెండున్నర తులాల నెక్లెస్, మొ త్తం 20 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


