ఘనంగా సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Aug 3 2026 3:51 AM | Updated on Aug 3 2026 3:51 AM

జిల్లాలో మొక్కలు నాటి కేక్‌లు కట్‌ చేసిన నాయకులు

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా లో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ రూ రల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి తదితరులు సుదర్శన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సుదర్శన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, గీత పారిశ్రామిక సహకార కా ర్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌, డీసీసీ మాజీ ప్రెసిడెంట్‌ మానాల మోహ న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, విజయ్‌పాల్‌ రెడ్డి, సుమన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement