గోదారి గట్టున షూటింగ్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

గోదారి గట్టున షూటింగ్‌ సందడి

Aug 3 2026 3:51 AM | Updated on Aug 3 2026 3:51 AM

ఒక గుంతను తప్పిస్తే.. మరో గుంత

ఒక గుంతను తప్పిస్తే.. మరో గుంత
ఎన్‌హెచ్‌–44 పద్మాజివాడీ ఎక్స్‌ రోడ్డు నుంచి గాంధారి మీదుగా బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. ఒక గుంతను తప్పించబోతే ఇంకో గుంత తగులుతోంది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. పద్మాజివాడీ ఎక్స్‌ రోడ్డు నుంచి భూంపల్లి స్టేజీ వరకు అడుగడుగునా గుంతలు ఇబ్బంది పెడుతున్నాయి. దాదాపు గాంధారి వరకూ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలూ చోటు చేసుకుంటున్నాయి. మరమ్మతులను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో చిత్రీకరణ

హీరో విశ్వక్‌సేన్‌ను చూసేందుకు

ఎగబడిన జనం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గోదావరి అందాలు, ప్రకృతి సోయగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్‌ తరుణ్‌భాస్కర్‌ డైరెక్షన్‌లోహీరో విశ్వక్‌సేన్‌ నటిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది–2’ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఆదివారం బ్యా క్‌వాటర్‌ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు క్యారవాన్‌లు, సినిమా సెట్టింగ్‌లను చూసి అక్కడికి పరుగులు తీశారు. విశ్వక్‌సేన్‌తో ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. సోమవారం సైతం పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఫైనాన్స్‌, చిట్టీలు, రియల్టర్స్‌, బిల్డర్స్‌

అవతారమెత్తుతున్న కొందరు టీచర్లు

ప్రయివేట్‌ స్కూళ్లు నిర్వహిస్తున్న

మరికొందరు..

పట్టించుకోని జిల్లా విద్యాశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement