డిగ్రీ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ 3,5వ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌, 2,4,6వ సె మిస్టర్స్‌ బ్యాక్‌లాగ్స్‌ (2022, 2023, 2024, 2025 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలు నవంబర్‌ లో నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత క లిగిన విద్యార్థులు తమ సంబంధిత కళాశాల ల్లో పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారాల ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 24 వరకు తుదిగడువని తెలిపారు. రూ.100ల అపరాధ రు సుముతో ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాల కు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

జొన్న సాగుకు సన్నద్ధం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఖరీఫ్‌లో సోయా, మొ క్కజొన్న సాగు పూర్తిచేసుకున్న రైతులు మ లిదశ సాగుకు సన్నద్ధమవుతున్నారు. జొ న్న సాగు చేసేందుకు భూములను ట్రాక్టర్ల తో దుక్కి దున్నడం ప్రారంభించారు. మరి కొందరు సీడ్‌ మక్క వేసేందుకు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. యాసంగి వరినాట్లు మొదలయ్యే నాటికి పంటలు చేతికి రానున్నాయి.

ఎస్సై, కానిస్టేబుల్స్‌

అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఖలీల్‌వాడి : పోలీస్‌ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల నుంచి ఉచిత రెసిడెన్సియల్‌ (80 రోజులు) శిక్షణ కోసం దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ దేవిదాస్‌, డిప్యూటీ డైరెక్టర్‌ రజిత ఒ క ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కా మారెడ్డి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులు ఆఫ్‌లై న్‌, లేదా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతోపాటు వారు దరఖాస్తు చేసిన ఎస్సై, కా నిస్టేబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫారంతోపాటు ఎస్సె స్సీ, ఇంటర్‌, డిగ్రీ, టీసీ, కులం, ఆదాయం, ఆధార్‌ కార్డ్‌ పత్రాలతో పాటు కావలసిన స ర్టిఫికేట్స్‌ను జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ స ర్కిల్‌, ఎస్సీ బాయ్స్‌ కళాశాలలో అందించాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఈనెల 7న సాయంత్రంలోపు అందించాలన్నారు. మరి న్ని వివరాలకు 9912227425, 99511994 60, 9989919211ను సంప్రదించాలన్నారు.

నకిలీ సర్టిఫికెట్‌ వ్యవహారం..

లెక్చరర్‌ తొలగింపు?

ఖలీల్‌వాడి: నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉ ద్యోగాలు పొందిన జూనియర్‌ లెక్చరర్లపై ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కొరడా ఝళిపించింది. ఈనేపథ్యంలో మాక్లూర్‌ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్‌ను తొలిగించినట్లు తెలిసింది. 2014కు ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3300 మందిని 2023లో రెగ్యులరైజ్‌ చేశారు. అప్పుడే కొంతమంది లెక్చరర్లు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చదివినట్లుగా సర్టిఫికేట్లు అందించారు. వాటిని ఇంటర్‌ బోర్డు అధికారులు ఆయా విశ్వవిద్యాలయాలను సంద ర్శించి వివరాలను పరిశీలించగా, కొంతమంది ఉద్యోగులు ఫేక్‌ సర్టిఫికెట్స్‌ సమర్పించినట్లు తేలింది. మాక్లూర్‌ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తున్న ఇంగ్ల్లిష్‌ లెక్చరర్‌ రవీందర్‌రావు ఫేక్‌ సర్టిఫికెట్స్‌ సమర్పించిన వారిలో ఉన్నారు. దీనిపై డీఐఈవో రవికుమార్‌ను వివరణ కోరగా.. రవీందర్‌ రావును కాలేజీకి వెళ్లవద్దని సూచించామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా అందలేదని తెలిపారు.

అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్యను పెంచాలి

బోధన్‌ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టిసారించా లని ఇన్‌చార్జి జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి సౌందర్య సిబ్బందికి సూచించా రు. ఎడపల్లి మండలం జానకంపేటలో మంగళవారం సెక్టార్‌ స్థాయి జాతీయ పోషణ మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మా ట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అనంతరం గర్భిణులకు సా మూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. సర్పంచ్‌ సుంచనకోట అనురాధ, సీడీపీవో నందిని, మండల సూపర్‌వైజర్‌ సావిత్రి, అంగన్‌వాడి టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement