28 నుంచి కాలభైరవస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

28 నుంచి కాలభైరవస్వామి బ్రహ్మోత్సవాలు

Nov 25 2026 4:18 AM | Updated on Nov 25 2026 4:18 AM

రామారెడ్డి(ఎల్లారెడ్డి): దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీ కాలభైరవస్వామి జన్మది నోత్సవాన్ని ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 2 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చింతల శంకర్‌, ఈవో ప్రభు గుప్తా తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 28న గణపతి పూజ, సంతతధారాభి షేకంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 29న బద్ది పోచమ్మ బోనాలు, 30న లక్ష దీపా ర్చన, 1న డోలారోహణం, సాయంత్రం బండ్ల ఉరేగింపు, రథోత్సం, 2న కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు శెట్టిపల్లి రాజు, ఎర్ర రాజు, శెట్టిపల్లి భైరయ్య, గంగరాజం గౌడ్‌, రాంసింగ్‌, అర్చకులు శ్రీనివాసశర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement