సిద్ధుల గుట్టపై సినిమా షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సిద్ధుల గుట్టపై సినిమా షూటింగ్‌

Nov 25 2026 4:18 AM | Updated on Nov 25 2026 4:18 AM

సిద్ధుల గుట్టపై సినిమా షూటింగ్‌ లింబాద్రిగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు రైళ్ల సర్వీసులను యథావిధిగా కొనసాగించాలి విద్యార్థికి అస్వస్థత

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని సిద్ధుల గుట్టపై లక్ష్మీ ఫిల్మిస్‌ వారు నిర్మిస్తున్న బుల్లెట్‌ రెడ్డి చిత్ర షూటింగ్‌ను మంగళవారం ప్రారంభించారు. షూటింగ్‌కు ముందు చిత్ర యూనిట్‌ ఆలయ కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి దర్శకుడిగా, హీరోగా, చిత్ర నిర్మాతగా కొడాలి రోహిణి వ్యవహరిస్తున్నారు. అనంతరం సిద్ధు ల గుట్ట ఆవరణలో హీరో ఆది, హీరోయిన్లు మేఘన, హనిక, పావనిలతో పలు సన్నివేశా లను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ఉగాది రోజున విడుదల చేస్తున్నట్లు రోహిణి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ జి మ్మి రవి, అంకాపూర్‌ సర్పంచ్‌ దేవేందర్‌ రెడ్డి, కెమెరామన్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌టౌన్‌: లింబాద్రిగుట్ట జాతరకు భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్‌ డిపో ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులు నడుపుతున్నట్లు డిపో అధికారులు తెలిపారు. ఆర్మూర్‌ నుంచి లింబాద్రిగుట్టకు రాకపోకలు సాగించేందుకు వీలుగా బస్సులను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఖలీల్‌వాడి: ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పలు రైళ్ల సర్వీసులను రైల్వేశాఖ ఉన్నతాధికా రులు యథావిధిగా కొనసాగించాలని రైల్వే ఫో రం ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ఫన్నీ మంగళ వారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 26 జాల్నా నుంచి తిరుపతి ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌కు, తిరుచానూరు నుంచి నాందేడ్‌ వారంతపు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ చివరి రోజు అని ఈ రైళ్ల సర్వీసులను యథావిధిగా కొనసాగించాలన్నా రు. ప్రత్యేక రైళ్లు వయా నిజామాబాదు – కరీంనగర్‌–పెద్దపల్లి మార్గం గుండా నడుస్తున్నాయ ని వీటిని అలాగే కొనసాగించాలని కోరారు.

బాన్సువాడ: బీర్కూర్‌ మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ జ్యోతీబా ఫూలే పాఠశాలకు చెందిన ప్రశాంత్‌ అనే విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. పాఠశాల బాత్‌రూంలో ప్రశాంత్‌ కాలు జారి పడిపోవడంతో ఛాతీకి గాయమైంది. పాఠశాల సిబ్బంది సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో విద్యార్థికి ఛాతిలో నొప్పి అధికమైంది. దీంతో విద్యార్థి ప్రశాంత్‌ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. వారు పాఠశాలకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రశాంత్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement