నిజామాబాద్ రూరల్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందూరులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని ప్రసిద్ధ నీలకంఠేశ్వర ఆలయం, శంభుని ఆలయం, లలితాదేవి ఆలయాలతో పాటు పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు శివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాలు దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు.


