కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మహిళా మున్సిపల్ కార్మికులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య పనులు ముగించుకుని మహిళా కార్మికులు ఆటోలో వెళ్తున్నారు. ఆటో ప్రియా టాకీస్ రోడ్డు వద్దకు చేరుకోగానే, ఎదురుగా ఓ బైక్ అకస్మాతుగా అడ్డువచ్చింది. బైక్‌ను ఢీకొట్టకుండా తప్పించే క్రమంలో డ్రైవర్ ఆటోను ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మున్సిపల్ కార్మికులు రవళి, రాజమణి, లలిత, స్రవంతి, పండ సావిత్రి, కనకవ్వ, విజయ, మరియా, స్వప్నలకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆటో నడుపుతున్న డ్రైవర్ కొండాపూర్‌కు చెందిన చాకలి బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న మున్సిపల్ కార్మికులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ ఆస్పత్రిలో పరామర్శించారు.
ప్రమాదంలో గాయపడ్డ కార్మికులు


