నిజామాబాద్ రూరల్: మండలంలోని తాడెం గ్రామంలో వేల్పూర్ భూమయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమయ్య ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాధితులు వెంటనే అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో సుమారు రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు.


