● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
● సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం
నవీపేటలోని గిడ్డంగి పరిశీలన
నవీపేట : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడమే లక్ష్యమని ప్రభు త్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వ భాగస్వామ్యంతో హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం నవీపేటలోని మార్కెట్ కమిటీ గిడ్డంగిని మంగళవారంఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితోపాటు పరిశీలించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు గిడ్డంగి భవనం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ని ర్ధారించారు. ఈసందర్భంగా సు దర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 70వేల మంది విద్యార్థులకు దీనిద్వారా అల్పాహారం అందించను న్నట్లు తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం అవసరమైన విద్యుత్, నీటి వసతి, రోడ్డు సౌకర్యం వంటి అ న్ని సదుపాయాలను సత్వరమే సమకూర్చాలని అ ధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చై ర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఆర్డీవో సాయన్న, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాజేశ్వర్, ఆర్‌డబ్ల్యూఎ స్ ఈఈ రాకేష్, మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షు డు శేఖర్‌గౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ నగేష్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ తదితరులు ఉన్నారు.


