హోటళ్లపై ‘ఆహారభద్రత’ దాడులు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లపై ‘ఆహారభద్రత’ దాడులు

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

● జిల్లా కేంద్రంలో తనిఖీలు

● ఒక బిర్యానీ హోటల్‌ సీజ్‌..

● మరికొన్నింటిపై చర్యల కోసం

ఉన్నతాధికారులకు నివేదిక

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని పలు హో టళ్లు, రెస్టారెంట్‌లపై తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారి టీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ సేఫ్‌) అ ధికారులు మంగళవారం సాయంత్రం మెరుపు దా డులు నిర్వహించారు. నిబంధనలను గాలికి వదిలే సి కల్తీ, అపరిశుభ్ర ఆహారాన్ని విక్రయిస్తున్న సంస్థ ల ఫుడ్‌ లైసెన్సులను తక్షణమే సస్పెన్షన్‌ చేస్తూ సిఫా ర్సు చేశారు. రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న గ్లామర్‌ హోటల్‌లో తనిఖీలు చేసిన అధికారులు.. కిచెన్‌ ని ర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో హోటల్‌ను సీజ్‌ చేశారు. నిఖిల్‌సాయి, రెజునోవేట్‌ హోటల్స్‌(మిస్టర్‌ పొట్టేల్‌)ను తనిఖీ చేశారు. ఆయా హోటళ్లలో అపరి శుభ్రమైన వంటగదులు, కాలం చెల్లిన ఆహారపదా ర్థా లను గుర్తించారు. పలు హోటళ్లల లైసెన్సుల స స్పెన్షన్‌, రద్దుకు ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ జి ల్లాల పరిధిలోని 44వ నంబర్‌ జాతీయ రహదారి వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్‌లపై టీజీ సేఫ్‌ అధికా రులు దాడులు నిర్వహించారు. మొత్తం 10 ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగాయి. హైవే వెంట మొత్తం 20 సంస్థల్లో మెరుపు దాడులు నిర్వ హించాయి. కల్తీ అనుమానంతో 21 ఆహార నమూ నాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. విధిగా భద్ర తా నిబంధనలు పాటించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్‌ చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement