కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పో సుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీ స్టాల్ యజమా ని పొలాస సుధాకర్ ప రిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసు లు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపి స్తూ సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా, అ తడిని వెంటనే పోలీస్ సిబ్బంది నిజామాబాద్ జీజీ హెచ్‌కు, తర్వాత మెరుగైన చికి త్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తొంభై శాతం కాలిన గా యాలతో చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెంది నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతుడికి భార్య సరోజ, ఇద్దరు కొడుకులు శ్రీనివాస్, వినయ్ ఉన్నారు.
కిరాణాషాపు యజమానిపై కేసు నమోదు
సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక కిరాణా షాపు యజమాని మధుపై కేసు నమోదు చేసినట్లు సీఐ పొన్నం సత్యనారాయణగౌడ్ తెలిపారు. అలాగే ఎస్సై తిరుపతిపై శాఖాపరమైన విచారణ చేపడతామన్నారు.
భీమ్‌గల్ బంద్
సుధాకర్ ఆత్మహత్య ఘటనపై సీపీ సాయి చైతన్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపు మేరకు భీమ్‌గల్ పట్టణంలో మంగళవా రం బంద్ పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటళ్లు, టిఫిన్ సెంటర్‌లు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం నాయకులు రోడ్డుపై బైఠాయించారు. బంద్ నేపథ్యంలో పట్టణంలో పో లీస్ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


