● వారం రోజుల్లో 10 టీఎంసీలు..
● 31.918 టీఎంసీల నీటి నిల్వ
వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 47,391 క్యూసెక్కులు రాగా, రాత్రి సమయానికి 19,451 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో తగ్గి కొనసాగుతోంది. గత నెల 26వ తేదీన ప్రాజెక్టు నీటిమట్టం1069 అడుగులు (21.882 టీఎంసీలు) ఉండగా.. వారం రోజుల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది. ఆదివా రం రోజున ప్రాజెక్టులో 31.918 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 291 క్యూసెక్కుల నీరు పోతోంది.
నేటి నుంచి
పీజీ సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
మార్షల్ ఆర్ట్స్‌లో
బంగారు పతకం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జీవదాన్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థి షేక్ అక్బరుద్దీన్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కటా విభాగంలో బంగారు పతకం సాధించారు. అక్బరుద్దీన్ బంగారు పతకం సాధించడంపై కామారెడ్డి రాజీవ్‌నగర్‌కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ ప్రతినిధులు తాజొద్దీన్, రాజు, మాలజంగం స్వామి, ఇమ్రత్ సింగ్ తదితరులు అభినందించారు.


