లింగంపేట/సదాశివనగర్ : లింగంపేట సమీపంలోని వరి పంటలను శనివారం మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ పరిశీలించారు. లింగంపేట గ్రామానికి చెందిన వెంకట్‌గౌడ్ వరి పంటను పరిశీలించి నీటి యాజమాన్యం పాటించి, పంటలో పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని తగిన మందులు వాడాలని సూచించారు. ఏఈవో రాజ్యలక్ష్మి, రైతులు వెంకట్‌గౌడ్ తదితరులు ఉన్నారు. సదాశివనగర్ మండలం ధర్మారావ్‌పేట్ గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏఈవో లిఖిత్ రెడ్డి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద అందుబాటులో ఉండాలని వారు సూచించారు.


