డిచ్‌పల్లి: మండలంలోని బీబీపూర్ గ్రామ శివారులోగల 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. హైవేపై శనివారం ఓ డీసీఎం ముందున్న మరో డీసీఎంను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈఘటనలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ షేక్ రఫీని స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు.


