నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్‌లో 17కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టగా నాగావళి ఎక్స్‌ప్రెస్ (సంబల్పూర్ – నాందేడ్)లో అనుమానాస్పదంగా ఉన్న హరిహర పట్నాయక్ అనే వ్యక్తి పట్టుకున్నారు. తనిఖీ చేయగా 17 కేజీల గంజాయి లభ్యం కావడంతో అతడిని అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఓ మహిళ బ్యాగునుంచి రూ.72వేలు అపహరణకు గురైంది. బాధిత మహిళ బస్సు ఎక్కే ముందు గుర్తు తెలియని వ్యక్తి బ్యాగులో నుంచి డబ్బులు దొంగలించినట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


