బాన్సువాడ: విద్యార్థిని దేశభక్తుడిగా తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు విభాగ్ అభ్యాస వర్గ ప్రారంభమైంది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1949లో నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందన్నారు. జ్ఞానం, శీలం, ఏకత అనే సూత్రాలతో విద్యార్థిని దేశభక్తుడిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నామన్నారు. దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్, పూర్వ కార్యకర్త అంజా గౌడ్, జాతీయ కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్, వైష్ణవి, సూర్య కుమార్, వినోద్, గిరి, స్వామి రెడ్డి, అనిల్ రెడ్డి, స్థానిక నాయకులు శివ చరణ్, అమృత్ తదితరులు పాల్గొన్నారు.


