జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన యాటకర్ల రవి (50) ఇటీవల ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం దుబాయ్‌కి వెళ్లగా, గత నెల 28న అక్కడి కంపెనీలో పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కాగా బంధువుల సహకారంతో శనివారం మృతదేహాన్ని స్వగ్రామమైన పడకల్‌కు తీసుకువచ్చారు. మృతుడు దుబాయ్‌లో ఉండగానే పడకల్‌లో సొంతంగా కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ నెల 18న ఇండియాకు వచ్చి గృహప్రవేశం చేయాలని అనుకున్నాడు. కానీ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు రవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


