నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Aug 3 2026 3:51 AM | Updated on Aug 3 2026 3:51 AM

న్యూస్‌రీల్‌

వాతావరణం

ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.

ఆర్చరీలో పతకాల..

కఠోర సాధన.. లక్ష్యంపై ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన ఆర్చరీ క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు.

సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 8లో u

అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనం

పోతరాజుల చిందులు.. శివసత్తుల పూనకాలు.. అమ్మవార్ల తొట్లెలు.. పులోరియా నినాదాల హోరు మధ్య సరిగుల్ల కోసం పోటాపోటీ.. కదిలొస్తున్న అమ్మను కళ్లారా చూసేందుకు వేల సంఖ్యలో వేచి ఉన్న జనం.. ఇదీ.. నిజామాబాద్‌ నగరంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగ సందడి. పిల్ల్లాపాపలను సల్లంగా చూడాలని, పాడిపంట సమృద్ధిగా ఉండాలని కోరుతూ అడుగడుగునా నగరవాసులు గ్రామదేవతలను కొలిచారు. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో శారదాంబ గద్దె వద్ద అమ్మవార్లను ప్రతిష్టించి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, సర్వసమాజ్‌ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, కార్యదర్శి బంటు రాజేశ్వర్‌, కోకన్వీనర్‌ అదె ప్రవీణ్‌, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర మేయర్‌ ఉమారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖిల్లా నుంచి డప్పుచప్పుళ్ల మధ్య బయల్దేరిన అమ్మవార్ల ముందు సరి గుల్ల ముందుకు సాగింది. కదిలొస్తున్న అమ్మవారిని చూస్తూ నగరవాసులు తన్మయత్వానికి లోనయ్యారు. – నిజామాబాద్‌ రూరల్‌

బందోబస్తును పర్యవేక్షిస్తున్న సీపీ సాయిచైతన్య, పోలీసు ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement