ఖలీల్‌వాడి: క్రమశిక్షణ గల యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వ్యసనాలు, డ్రగ్స్, జోలికి వెళ్లరాదని జిల్లా యూత్ ఆఫీసర్ పవన్ కుమార్ అన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సంయుక్తంగా ‘మై భారత్–నషముక్త్ భారత్‘ జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, ‘మై భారత్‘లో భాగంగా వివిధ కళాశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించామన్నారు. విజేతలకు సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశామన్నారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, అకడమిక్ కో ఆర్డినేటర్ నహిదా బేగం, భరత్ రాజ్, జిల్లా స్పోర్ట్స్ అధికారి పవన్, ఎకై ్సజ్ ఇన్స్‌పెక్టర్ స్వప్న, బ్రహ్మకుమారీస్ మూర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


