మోపాల్: రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన విద్యార్థుల ప్రవేశాలను హాస్టల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ హోదాలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆమోదించారు. సోమవా రం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని నిజామాబాద్ డివిజన్‌లో ఉన్న ఆరు వసతిగృహాల్లో ఒక్కో హాస్టల్‌కు 100 చొప్పున 600 సీట్లు మంజూరు కాగా, పాత విద్యార్థులతో కలుపుకొని 378 మంది ఉన్నారు. ఇంకా 222 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 3 హాస్టళ్లకుగాను 300 సీట్లు ఉండగా, మొత్తం ప్రవేశాలకు కూడా ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్, ఆర్మూర్ అసిస్టెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు సోమశేఖర్, రాజ గంగారాం, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సుజయ్, భాగ్యవతి, ఆయా మండలాల హెచ్‌డబ్ల్యూవోలు పాల్గొన్నారు.


