రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jul 29 2026 2:22 AM | Updated on Jul 29 2026 2:22 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఇందల్వాయి : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఇందల్వాయి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి నుంచి నిజామాబాద్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గంగారాం తండా శివారులో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొన్నది. అతనికి తీవ్రగాయాలు కావడంతో టోల్‌ప్లాజా సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

చికిత్స పొందుతూ ఒకరు..

నిజామాబాద్‌అర్బన్‌: రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్‌ ఫాం పై గుర్తుతెలియని మహిళ సోమవారం అనారోగ్యంతో పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మహిళ వయస్సు 40 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతురాలి కుడి చేతిపై కన్నడ భాషలో పద్మ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతురాలి వివరాలు తెలిసినవారు 87126 58591 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement