సర్‌ దరఖాస్తులను సకాలంలో సమర్పించాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ దరఖాస్తులను సకాలంలో సమర్పించాలి

Jul 29 2026 2:22 AM | Updated on Jul 29 2026 2:22 AM

కామారెడ్డి టౌన్‌: ప్రత్యేక ఓటరు నమోదు (సర్‌) ప్రక్రియ దరఖాస్తులను ఇంకా సమర్పించని ఓటర్లు ఆగస్టు 1వ తేదీలోపు సంబంధిత అధికారులకు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రవితేజ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 46, 47వ వార్డుల్లో జరుగుతున్న సర్‌ ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. సేకరించిన సర్‌ ఫారాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్‌ హిమబిందు, కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణల, ఆర్‌ఐ ప్రసన్న, జీపీవో సూరజ్‌, నితీష్‌, బీఎల్‌వోలు కాశీరాం, వెంకటలక్ష్మి, రేఖ, బబిత, జమున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement