నిర్వహణ భారం తగ్గుతుంది
పర్యావరణానికి మేలు
పెర్కిట్: పారిశుద్ధ్యం మెరుగు పర్చడంతో పాటు దో మలు, అంటువ్యాధులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభు త్వం గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయినేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఆలూర్ మండల కేంద్రంతో పాటు జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామం పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి.
ప్రయోజనాలు..
సీసీ డ్రెయినేజీలతో పోల్చుకుంటే మ్యాజిక్ డ్రెయినేజీ నిర్మాణంలో వ్యయాలు మూడింతలు తగ్గడమే కాకుండా నిర్వహణ భారం సైతం లేకుండా పోతుంది. అలాగే నీరు భూమిలో ఇంకి పోవడం వల్ల దోమల బెడ ద తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు దుర్వాసన సమస్య ఉండదు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ అంతగా అవసరం ఉండదు. వంద మీటర్ల నిడివి గల సీసీ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. నాలుగు లక్షలు ఖర్చు అవుతుండగా మ్యాజిక్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.లక్ష లోపు మాత్రమే వ్యయం అవుతుంది. ఆలూర్‌లో 90 మీటర్ల మ్యాజిక్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. ఇంకుడు గుంతల మాదిరిగానే ఎంత మేరకు డ్రెయినేజీ అవసరమే అంత వరకు గుంతలు తీసి కంకర రాళ్లు, ఇసుక లేయర్లుగా వేసి నిర్మాణం చేపడుతున్నారు. అలాగే ఇళ్లలో నుంచి వచ్చే మురుగుతో పాటు ఒక వేళ వర్షాలు కురిసినపుడు వచ్చే నీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఇంకి పోవడానికి ప్రతి 25 నుంచి 30 మీటర్ల మధ్య సోక్‌పిట్‌లను నిర్మించారు. మ్యాజిక్ డ్రెయినేజీల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్య ఎక్కువగా ఉంది. మ్యాజిక్ డ్రెయినేజీల ని ర్మాణంతో వ్యయాలు తగ్గడ మే కాకుండా నిర్వహణ తగ్గుతుంది. సీసీ డ్రెయినే జీలకు అయ్యే వ్యయాలతో అవసరమున్న అన్ని ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రెయినేజీలను నిర్మించవచ్చు. – ముక్కెర విజయ్, సర్పంచ్, ఆలూర్
పర్యావరణ హితంతో పా టు భూగర్భ జలాలను పెంపొందించడానికి మ్యాజిక్ డ్రెయినేజీలు ప్రయోజనకరంగా ఉంటాయి. పైలట్ ప్రాజెక్టుగా ఆలూర్, మునిపల్లి గ్రామాలను ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో విజయవంతమైతే మిగతా గ్రామాల్లో నిర్మాణాలు చేపడతాం. – సాయన్న, డీఆర్డీవో
మెరుగుపడనున్న పారిశుద్ధ్యం
పైలట్ ప్రాజెక్టుగా
ఎంపికై న ఆలూర్, మునిపల్లి గ్రామాలు


