సుభాష్‌నగర్: నిజామాబాద్ నగర కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. సీడీఎంఏ శ్రీదేవిని మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి, పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అర్బన్ చాలెంజ్ ఫండ్‌పై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే కార్పొరేషన్‌కు రావాల్సిన జనరల్ ఫండ్, ఇతర పనులను మంజూరు చేయాలని విన్నవించారు.
లయన్స్ కంటి ఆస్పత్రికి రూ.10లక్షల విరాళం
బోధన్: పట్టణంలోని రాకాసీపేట ప్రాంతంలో గల డాక్టర్ కేవీ రెడ్డి మెమోరియల్ లయ న్స్ కంటి ఆస్పత్రి అభివృద్ధి నిమిత్తం దివంగత బోధన్ మాజీ ఎమ్మెల్యే కేవీ రెడ్డి కుమారుడు ఎన్‌ఆర్‌ఐ (యూఎస్) డాక్టర్ రవీందర్‌రెడ్డి రూ.10లక్షల విరాళం ఇచ్చారు. లయ న్స్ కంటి ఆస్పత్రిలో మంగళవారం రవీందర్‌రెడ్డి బంధువు ప్రభురెడ్డి విరాళం చెక్కును ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్‌రావుకు అందించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. గతంలో కూడా ఆయన వి రాళాల రూపంలో ఎంతో సహయం అందించారని పేర్కొన్నారు. ఆస్పత్రి చైర్మన్ నర్సింహరెడ్డి, ఉమేశ్ షిండే పాల్గొన్నారు.
‘జలసిరి’పై
నేడు, రేపు గ్రామ సభలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీల్లో గురు, శుక్రవారాల్లో ‘జలసిరి’ కార్యక్రమంపై గ్రామసభలు నిర్వహించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశా ల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో స ర్పంచ్, కార్యదర్శుల అధ్యక్షతన ఈ గ్రామ సభలు జరగనున్నాయి. గ్రామ ప్రజలు, ఎస్‌హెచ్‌జీ మహిళలను ఆహ్వానించి ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించుకుంటే క లిగే లాభాలపై అవగాహన కల్పించనున్నా రు. ఇదివరకే అన్ని మండల పరిషత్ కార్యా లయాల్లో సర్పంచులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీవోలకు ఎంపీడీవోలు సమావేశాలు నిర్వహించి వివరించారు.
క్షయ రహిత భారతే లక్ష్యం
సుభాష్‌నగర్: క్షయ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యమని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నా రు. నగరంలోని సీతారాంనగర్ యూపీహెచ్‌సీ పరిధిలో మంగళవారం నిర్వహించిన టీబీఎంబీఏ 2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈసందర్భంగా 28వ డివిజన్ కార్పొరేటర్ మహేందర్ ని–క్షయ్ మిత్రగా క్షయ వ్యాధి రోగులకు సేవలందిస్తున్న నేపథ్యంలో ఘనంగా సత్కరించారు. మహేందర్ నిక్షయ్ మిత్రగా 4 ఫుడ్ కిట్స్ టీబీ రోగులకు అందజేశారు. క్షయ నియంత్రణ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. డీటీసీవో దేవి నాగేశ్వరి తదితరులు ఉన్నారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి
నిజామాబాద్‌అర్బన్: ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరితగతిన పోలీసులు స్పందించాలని పోలీసు కమిషనర్ సాయిచైతన్య అన్నారు. నగరంలోని మూడోటౌన్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పీఎస్ పరిధిలోని అన్ని కాలనీలో పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమైన కాలనీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చే యాలన్నారు. ప్రతి కేసు విచారణలో నూత న టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. ఏసీపీ ప్రకాశ్ యాదవ్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు, నారాయణ, సిబ్బంది తదితరులు ఉన్నారు.


