న్యూస్‌రీల్
నిజామాబాద్
ఎన్యుమరేషన్ ఫారాలను..
ఓటర్లు ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్వోలకు అందించాలని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి కోరారు.
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్ అర్బన్: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు సమీపిస్తోంది. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మినహా.. అన్ని నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అర్బన్ నియోజకవర్గంలో ఆగస్టు 3వ తేదీలోగా ఎస్‌ఐఆర్ పూర్తవుతుందా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అర్బన్ నియోజక వర్గంలో మొత్తం 3,82,061 ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 2,08,387 (67.60 శాతం) ఎన్యుమరేషన్ ఫామ్‌ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఆర్మూర్ నియోజక వర్గంలో 2,15,186 మంది ఓటర్లు ఉండగా 1,89,249 ఫామ్‌ల (87.95 శాతం), బోధన్ నియోజకవర్గంలో 2,23,152 ఓట్లకుగాను 1,94,589 ఎన్యుమరేషన్ ఫామ్‌లు డిజిటలైజ్ అయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 1,96,331 మంది ఓటర్లు ఉండగా 1,75,377 (89.33శాతం)ఫామ్‌లు, నిజామాబాద్ రూరల్‌లో 2,64,723 మంది ఓటర్లకుగాను 2,31,799 (87.56 శాతం) ఫామ్‌లు, బాల్కొండ నియోజక వర్గంలో 2,32,081 ఓటర్లు ఉండగా 2,08,086 ( 89.66 శాతం) ఎన్యుమరేషన్ ఫామ్‌లు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. బాల్కొండ నియోజకవర్గం ఎస్‌ఐఆర్‌లో ముందంజలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 14,39,734 మంది ఓటర్లకుగాను 12,07,487 (83.87 శాతం) ఎన్యుమరేషన్ ఫామ్‌ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఎస్‌ఐఆర్‌లో భాగంగా 30,734 మంది ఓటర్లు చనిపోయినట్లు గుర్తించిన అధికారులు వారి పేర్లను తొలగించనున్నారు. 52,814 ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.
నా పేరు తాటిపాముల నారాగౌడ్. 25 ఏళ్లుగా నిజామాబాద్ నగరంలోనే నివసిస్తున్నా. వివిధ డివిజన్‌లలో అద్దె ఇళ్లలో ఉన్నా. నాతోపాటు నా కుటుంబ సభ్యులు సుమారు 15 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ఓటు వేశారు. వేరే ప్రాంతంలో మాకు ఓటు లేదు. ప్రస్తుతం 6వ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఇక్కడే ఓటు వేశాం. మా కుటుంబంలోని ఇద్దరికి ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇప్పటి వరకు అందలేదు. బీఎల్‌వోలు కూడా ఫోన్ చేయలేదు. గడువు తేదీ సమీపిస్తోంది. ఎక్కడ సంప్రదించాలో అర్థం కావడంలేదు.
అర్బన్‌లో గందరగోళం
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్‌లలో ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయడం, అనంతరం వాటి పరిశీలన ఇబ్బందికరంగా మారింది. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫామ్‌లను ఇంటింటికి చేరవేయడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఫామ్‌లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియకు రాగానే వివరాలు లేక చేతులెత్తేస్తున్నారు. మరోవైపు పలు కాలనీల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు అద్దెకు ఉండడం, ప్రస్తుతం ఉన్న ఓట్లను సొంత గ్రామాలకు బదిలీ చేసుకోవడం, ధ్రువపత్రాలు లేనివారు ఎక్కువ సంఖ్యలో ఉండంతో బీఎల్‌వోలకు ఓటర్ల గుర్తింపు ఇబ్బందికరంగా మారింది.
సర్‌లో వెనుకబడిన నిజామాబాద్ అర్బన్
నగరంలో కొన్నిచోట్ల ఇళ్లకు చేరని
ఎన్యుమరేషన్ ఫామ్‌లు!
బాల్కొండ నియోజకవర్గంలో
89.66 శాతం పూర్తి


