అడవుల సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

అడవుల సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): అడవుల సంరక్షణను నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) వినయ్‌కుమార్‌ ఫారెస్ట్‌ అధికారులకు సూచించారు. సోమ వారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు బాసర సీసీఎఫ్‌ అపర్ణ, డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మాక్లూ ర్‌ మండలం చిన్నాపూర్‌ ప్రాంతంలోని అర ణ్య అర్బన్‌ పార్క్‌ను పీసీసీఎఫ్‌ సందర్శించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులు, పచ్చదనం, పరిశుభ్రత, సందర్శకులకు కల్పించిన సౌకర్యాలు, పార్కు నిర్వహణను పరిశీలించి అధికారులను అభినందించారు. అక్క డి నుంచి నిర్మల్‌కు వెళ్లిన ఆయన.. నిజామాబాద్‌, నిర్మల్‌, అదిలాబాద్‌ జిల్లాల అటవీ అధికారులతో సమీక్షించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, వన మహోత్సవం, ఇతర పథకాల అమలుపై మాట్లాడారు. ఎఫ్‌డీవోలు చంద్రశేఖర్‌, సుధాకర్‌, ఎఫ్‌ఆర్వోలు అరుణ్‌కుమార్‌, సంజయ్‌గౌడ్‌, రవిమోహన్‌ భట్‌, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement