మత్తుపై ఈగల్‌ పంజా | - | Sakshi
Sakshi News home page

మత్తుపై ఈగల్‌ పంజా

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

ఆల్ప్రాజోలంపై నిఘా

మాటువేసి పట్టుకుంటున్న ప్రత్యేక బృందం

జిల్లాలో విస్తృత తనిఖీలు

సరఫరా‘దారుల’ నిర్మూలన

నిజామాబాద్‌ అర్బన్‌: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్‌ ఫోర్స్‌’ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్‌ను తగ్గిస్తే అక్రమ సరఫరాదారులను పూర్తి నిర్మూలించవచ్చని భావించింది. అందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో గంజాయితోపాటు ప్రధానంగా కల్తీకల్లు తయారీకి ఉపయోగించి ఆ ల్ప్రాజోలం సరఫరాపై నిఘా పెట్టింది. అందులో భాగంగా నందిపేట్‌, ఆర్మూర్‌, ముప్కాల్‌, నిజామాబాద్‌ రూ రల్‌, బోధన్‌ తదితర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలువురిని పట్టుకున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై ఈగల్‌ ఫోర్స్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాలతో కలిసి నిఘా కొనసాగిస్తోంది. అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ప్రత్యేక వ్యూహాలతో సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తోంది. రాంచీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈగల్‌ ఫోర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో ఒక్కో చోట సుమారు 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా తరచూ మత్తు పదార్థాల నేరాలకు పా ల్పడుతున్న వారిపై పీఐటీ, ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం నిర్బంధ చర్యలు చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది.

తగ్గుముఖం

రాష్ట్రంలో 2024 సంవత్సరం నుంచి 2026 ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ఫలితంగా గంజాయి వినియోగం తగ్గుముఖం పట్టింది. 2024లో ఎనిమిది కమర్షియల్‌ క్వాంటిటీ కేసులు నమోదు కాగా, 2025లో రెండు కేసులకు తగ్గడం విశేషం. మరోవైపు మాదకద్రవ్యాల వ్యసనం బారి నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇస్తోంది. డీ అడిక్ష న్‌ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తోంది. ఇప్పటి వరకు 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, అందులో 192 కార్యక్రమాలు కల్తీకల్లు, మత్తు పదార్థాల వాడకంతో కలిగే దుష్ప్రభావాలపైనే చేపట్టడం గమనార్హం.

పక్కా ప్రణాళికతో ముందుకు..

జిల్లా పీఎస్‌ స్వాధీనం చేసుకున్న కిలో గ్రాములు

మత్తు పదార్థం

నిజామాబాద్‌ బోధన్‌(ఆర్‌) ఆల్ప్రాజోలం 2.500

రూరల్‌ ఆల్ప్రాజోలం 756

ముప్కాల్‌ ఆల్ప్రాజోలం 610

4వ టౌన్‌ ఆల్ప్రాజోలం 157.23

ఆర్మూర్‌ ఆల్ప్రాజోలం 500

నందిపేట్‌ ఆల్ప్రాజోలం 167.5

కామారెడ్డి జుక్కల్‌ గంజాయి 21 కిలోలు

ప్రధాన కేసులు ఇవే..

రాష్ట్రంలో గంజాయి ని ర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎలైట్‌ యాక్షన్‌ గ్రూఫ్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈగల్‌) ఎస్పీ ఆర్‌.గిరిధర్‌ పేర్కొన్నారు. నగరంలోని పోలీ స్‌ కమిషనర్‌ కార్యాలయంలో గంజాయి నిర్మూలనకు సంబంధించిన దాడులు, కేసుల వి వరాలను ఆయన సోమవారం వెల్లడించారు. గంజా యి, డ్రగ్స్‌ విక్రయాలు, అక్రమ రవాణాను అరిక ట్టేందుకు ‘ఈగల్‌ ఫోర్స్‌’ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగు తోందన్నారు. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గంజాయి సరఫరాను అరికడుతున్నామన్నా రు. ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాలు, సరిహద్దుల్లో దా డులు నిర్వహించి ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి, మత్తు పదార్థాల సమాచారాన్ని యాంటీ డ్రగ్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1908, వాట్సాప్‌ నంబర్‌ 8712671111కు చేరవేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement