‘అభివృద్ధి పనులకు నిధులివ్వండి’ | - | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధి పనులకు నిధులివ్వండి’

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలో రోడ్లు, వంతెన, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీరోడ్డు, రైల్వేస్టేషన్‌, నామ్‌దేవాడ వంతెన (ఆర్‌వోబీ) పొడిగింపు (అద నపు పనులు) చేయాలని కోరారు. ప్రధానంగా ఈ రైల్వేలైను దాటేందుకు విజయ్‌ థియేటర్‌, నామ్‌దేవ్‌వాడ వంతెన వద్ద మార్గాలు మాత్రమే ఉన్నాయని, ఈనేపథ్యంలో ఎల్లమ్మగుట్టలోని సోనీ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో మరో రైల్వే రన్‌ వే ఏర్పాటు చేయడం అవసరమని, ఇందుకోసం రూ.170 కో ట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. అలాగే ని జామాబాద్‌లోని రేడియోస్టేషన్‌ నుంచి ముదక్‌పల్లి పాత గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు కోసం రూ.30 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వర్ని రోడ్‌ జంక్షన్‌ నుంచి నిజామాబాద్‌, డిచ్‌పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్‌ మీదుగా కమ్మర్‌పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవుతో జాతీయ రహదారి కోసం ప్రతిపాదనలను మంత్రికి అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement