న్యూస్‌రీల్
నిజామాబాద్
కుర్చీలకు
నిఘా వ్యవస్థ..
నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను
పటిష్టపరచాలని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అన్నారు.
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి జూలై 2009 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. 16 సంవత్సరాల 10 నెలలు గడిచినా ఆయనను ప్రభుత్వం బదిలీ చేయలేదు.
వేల్పూర్ మండలం రామన్నపేట్ సహకార సొసైటీ కార్యదర్శి రణవీర్ గత 31 సంవత్సరాలుగా అదే సొసైటీలో పని చేస్తున్నారు. జిల్లాలో సింహభాగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా ఒకేచోట కొనసాగు తున్న సొసైటీ కార్యదర్శులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత మే నెలలో జీవో నెంబరు 82 తీసుకొచ్చినా సహకార సంఘాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.
● జిల్లాలో 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అత్యధిక సొసైటీల్లో కార్యదర్శు లు సంవత్సరాలుగా కుర్చీలకు అతుక్కుపోయారు. దశాబ్దాలుగా అక్కడే పని చేయడం వల్ల కార్యదర్శులపై విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కార్యదర్శులు రాజకీయాలలో సైతం జోక్యం చేసుకుంటూ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా కీలకపాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని సహకార సంఘాలు నష్టాల్లో నడవడానికి కార్యదర్శులే కారణమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల 204–25 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి 5లక్షల నిధుల దు ర్వినియోగం జరిగినట్లు ఆడిట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ సొసైటీ గత కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తోంది. సొసై టీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.31 లక్షల నష్టం చవిచూసింది. గతంలో వేల్పూర్ మండలం పడగల్, కోటగిరి మండలం ఎత్తోండ, తాళ్ల రాంపూర్ సొసైటీ లతోపాటు మాక్లూర్ సొసైటీల్లో పలు అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల పంపిణీ, నకిలీ రుణాలు, రుణాల రికవరీలో చేతివాటం, తాకట్టులో ఉన్న బంగారం మాయం తదితర అక్రమాలతో సొసైటీల్లో అక్రమాలకు పాల్పడ్డారు.
జిల్లాలోని అత్యధిక సొసైటీల్లో కార్యదర్శులు బదిలీలు కాకుండా దశాబ్దాల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పడగల్, ఎత్త్తొండ, తాళ్ల రాంపూర్, మాక్లూర్ సొసైటీల్లో అక్రమాలు జరిగాయి. ధాన్యం కొనుగోలు, ఎరువుల పంపిణీ, నకిలీ రుణాలు, రుణాల
రికవరీలో చేతివాటం, తాకట్టులో ఉన్న
బంగారం మాయం
తదితర అక్రమాలు వెలుగు చూశాయి.
జిల్లాలోని జక్రాన్‌పల్లి, ధర్పల్లి, వేల్పూర్, సిరికొండ, ఆర్మూర్ వ్యవసాయ సహకార సంఘాలలో రైతుల సభ్యత్వం, వాటాధనం ఎక్కువగా ఉంటుంది. ఈ మండలాల పరిధిలో సొసైటీ కార్యదర్శులు ఏళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వేల్పూర్ మండలం రామన్నపేట సొసైటీ కార్యదర్శి 31 ఏళ్లుగా, పడగల్ సొసైటీ కార్యదర్శి 15 ఏళ్లుగా, వేల్పూర్ సొసైటీ కార్యదర్శి 13 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ సొసైటీ కార్యదర్శి 15 ఏళ్లుగా, డిచ్‌పల్లి మండలం రాంపూర్ సొసైటీ కార్యదర్శి అత్యధికంగా 37 ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు.
ఆర్మూర్ మండలం పెర్కిట్ సొసైటీ కార్యదర్శి 33 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. ఇలా జిల్లాలో 25 మంది సొసైటీ కార్యదర్శులు దశాబ్దాలుగా ఒకే చోట పని చేస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న
సొసైటీ కార్యదర్శులు
జీవోనెంబర్ 82 అమలు
చేయని వైనం
కార్యదర్శులపై పలు అవినీతి ఆరోపణలు
ఫలితంగా నష్టాల్లో నడుస్తున్న సొసైటీలు


