నగరాభివృద్ధికి కట్టుబడి.. | - | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధికి కట్టుబడి..

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

సుభాష్‌నగర్‌: నగర అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి మనిషికి మౌలిక వసతుల కల్పన, అర్హులకు సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం ఒక్కో డివిజన్‌కు రూ.20లక్షలు మంజూరు చేస్తామని ఆమె ప్రకటించారు. మంగళవారం నిజామాబాద్‌ నగర పాలక సంస్థ మొదటి కౌన్సిల్‌ సమావేశం మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్‌ ఉమారాణి అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ ఎజెండా అంశాలను తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ఇటీవల రూ.70 లక్షలతో నగరంలో చేపట్టిన మురు గు కాల్వలు, డ్రెయినేజీ నిర్వహణ, పారిశుధ్య పనులను వివరించారు. చేపడుతున్న అభివృద్ధి పనులను తెలిపారు. చెత్త సేకరణ, పారిశుధ్య కార్మి కుల కొరత, శానిటేషన్‌పై బీజేపీ కార్పొరేటర్లు నిల దీయగా, మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఆయా విభాగాల అధికారుల బుజ్జగింపులతో కౌన్సిల్‌ సమావేశం సాదాసీదాగా ముగిసింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ సల్మా తహసీన్‌, బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ ప్రమోద్‌కుమార్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సమస్యలపై నిలదీత..

కౌన్సిల్‌ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఎజెండాకు ముందు తమ సమస్యలను వినాలంటూ పట్టుబట్టారు. దీంతో ప్రతి కార్పొరేటర్‌కు రెండు నిమిషాలచొప్పున మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ప్రధానంగా మురుగుకాల్వల పరిస్థితి, వాటర్‌ వర్క్స్‌, వీధిలైట్ల సమస్యలపై మాట్లాడారు. ఏఈలు ఫోన్లు లిఫ్ట్‌ చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. శానిటేషన్‌ చాలా పెద్ద సమస్యగా మారిందని, ఒక్కో డివిజన్‌కు రూ.50 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీతోపాటు ఎంఐఎం, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అడిగిన పలు ప్రశ్నలు, లేవనెత్తిన అంశాలపై మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ సమాధానమిచ్చారు.

కౌన్సిల్‌ తీర్మానాలు..

● నగరంలోని కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్సులన్నింటికీ కొత్తగా టెండర్లు పిలవాలి.

● పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను వెనక్కి పంపించాలి.

● ఒక్కో డివిజన్‌లో అభివృద్ధి పనులకు రూ.20 లక్షలు మంజూరు..

● ఔటర్‌ రింగ్‌ రోడ్‌, స్మార్ట్‌సిటీ కోసం ప్రతిపాదనలు

● మాస్టర్‌ ప్లాన్‌కు అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలి.

● అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయాలి.

మాట్లాడుతున్న నగర మేయర్‌ ఉమారాణి

మాట్లాడుతున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌

కౌన్సిల్‌సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు. నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రెయినేజీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు శానిటేషన్‌ సిబ్బంది, డ్రెయినేజీల నిర్వహణ, రోడ్లు, వాటర్‌ సప్లయ్‌, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

డివిజన్‌కు రూ.20 లక్షలు మంజూరు

నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి

బీజేపీ కార్పొరేటర్ల నిలదీతలు..

అధికారుల బుజ్జగింపులు

సాదాసీదాగా ముగిసిన ఎన్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement