● సర్వే అండ్ లాండ్స్ ఏడీ శ్రీనివాస్
డిచ్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే ప్రక్రియకు గ్రామస్తులందరూ సహకరించాలని జిల్లా సర్వే అండ్ లాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు. మంగళవారం డిచ్‌పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం భూభారతి రీసర్వే పైలట్ గ్రామాలుగా డిచ్‌పల్లి మండలంలోని కమలాపూర్, ఆరేపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ముందుగా గ్రామ సభ నిర్వహించి 15 రోజుల తర్వాత ఫీల్డ్ సర్వే ప్రారంభిస్తామన్నారు. మొదటి విడత గ్రామంలోని ఇండ్లు, తర్వాత గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల వివరాలను నిర్ణయిస్తారని తెలిపారు. అనంతరం సర్వే నంబరు ప్రకా రం ఎంజాయ్‌మెంట్ సర్వే చేస్తారని తెలిపారు. రైతులు తమ మోకాపై ఉన్న భూములను చూయించి, సర్వే సిబ్బందికి పట్టాపాసుబుక్కు జిరాక్స్ ప త్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. క్షేత్రస్థా యి సర్వే పూర్తి చేసిన అనంతరం జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రచురిస్తారని వివరించారు. అ భ్యంతరాలుంటే 60 రోజుల్లోపు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు. గ్రామానికి చెంది న రైతులు, గ్రామస్తులు సహకరించాలని విన్నవించారు. గ్రామ సర్పంచ్ రుత్విజ, తహసీల్దార్ కే.సతీ ష్‌రెడ్డి, సర్వేయర్ సూర్యప్రకాష్, డిప్యూటీ ఇన్‌స్పెపెక్టర్ ఆఫ్ సర్వే జగన్నాధం, సూపరింటెండెంట్ జగదీష్, సర్వేయర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


