రైతు భరోసా విడుదల చేసిన సీఎం | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా విడుదల చేసిన సీఎం

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

నడిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన కలెక్టర్‌

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. సుమారు 73.32 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.9 వేల కోట్లలను తొమ్మిది రోజుల వ్యవధిలోనే జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుంచి రైతులు ఆసక్తితో వీక్షించా రు. ఇందులో భాగంగా డిచ్‌పల్లి మండలం నడిపల్లి రైతు వేదిక నుంచి కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తదితరులు స్థాని క రైతులతో కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, రూరల్‌ ఏడీఏ కృష్ణ, ఏవో ఆంజనేయులు, సర్పంచులు కులాచారి అశ్విని, వాసుబాబు, భాస్కర్‌, శ్రీనివాస్‌, శాంతిలా ల్‌, లక్ష్మణ్‌, రవి, ఏఎంసీ డైరక్టర్‌ గంగారెడ్డి, సొసై టీ చైర్మన్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement