విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

విద్యాశాఖ ఆర్‌జేడీ ఉషారాణి

మోపాల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఉషారాణి తెలిపారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డీఈవో, సెక్టోరియల్‌ ఆఫీసర్లు, ఎంఈవోలతో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. మండలాలవారీగా గతేడాది కంటే ఎంతమేరకు విద్యార్థుల సంఖ్య పెరిగిందని అడిగి తెలుసుకున్నారు. డీఈవో అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు మరింత కృషి చేయాలని సూచించారు. గతేడాది కంటే అదనంగా పదిశాతం సంఖ్య పెంచిన ప్రధానోపాధ్యాయులను సత్కరించారు.

మొక్క నాటిన ఆర్‌జేడీ..

బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌ను తనిఖీ చేసిన ఆర్‌జేడీ ఉషారాణి పాఠశాల ఆవరణలో డీఈవో అశోక్‌తో కలిసి మొక్కను నాటారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1080 ఉన్నందుకు అభినందనలు తెలియజేశారు. పాఠశాలలో ఇంకా అడ్మిషన్లు పెరిగే అవకాశముందని హెచ్‌ఎం శంకర్‌ తెలిపారు.

హెచ్‌ఎంలను సన్మానించిన ఆర్‌జేడీ ఉషారాణి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement