నగర పాలక సంస్థలో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. కార్పొరేటర్లు ఫోన్ చేసినా, నేరుగా కలిసి విన్నవించినా కొందరు అధికారులు స్పందించడంలేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. స్పెషల్ ఫండ్ లేకపోవడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభారతి తదితర పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయన్నారు. నిజామాబాద్‌కు అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. యూడీఎఫ్ కింద రూ.400 కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేయించామన్నారు. కేంద్ర పథకం కింద రూ.200 కోట్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో యూజీడీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు.


