● ప్రమోద్‌కుమార్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్
నగరంలో రూ.160 కోట్లతో చేపడుతున్న యూజీడీ పనులు, రూ.217 కోట్లతో చేపడుతున్న అమృత్ పనుల్లో వేగవంతం చేయాలని ప్రమోద్‌కుమార్ డిమాండ్ చేశారు. యూజీడీ వర్క్‌లు కేవలం 9 శాతం, అమృత్ పనులు 20 శాతం మాత్రమే పూర్తయ్యాయని, గడువులోపు పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మాధవనగర్ ఆర్‌వోబీకి కేవలం రూ.15 కోట్లు వెచ్చిస్తే పూర్తవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడంలేదన్నారు. రూ.15 కోట్లు వెచ్చించని ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.


