డిచ్‌పల్లి: జనగణనలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా లెక్కలు – 2027 లో భాగంగా జనగణన సర్వే ఎన్యుమరేటర్లు, సూ పర్‌వైజర్లకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న తొలివిడత శిక్షణ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. ఎన్యుమరేట ర్లు, సూపర్‌వై జర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, సర్వేలో వారి పాత్ర ఎంతో కీలకమన్నారు. కా ర్యక్రమంలో డిచ్‌పల్లి తహసీల్దార్ కే.సతీష్‌రెడ్డి, ఏఎస్‌వో రవళి, ఎంఈవో నరేష్, ఆర్‌ఐ సంతోష్ , ట్రైన ర్లు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో ప్రతిజ్ఞ చేయించారు.


