రెండు మోపెడ్లు ఢీ: ఒకరి మృతి
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో రెండు మోపెడ్లు ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన తిగుల చంద్రం (65) తన టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్‌పై గురువారం వ్యక్తిగత పనుల నిమిత్తం రామేశ్వర్‌పల్లికి వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో ఎదురుగా మరో మోపెడ్‌పై వస్తున్న రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన కడారి బలరాం ఢీకొట్టాడు. ఈ ఘటనలో చంద్రం కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే చంద్రంను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆస్పత్రి వద్దనే మృతుడి కుమారుడు స్వామి వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్ చేసి అతనికి ఎఫ్‌ఐఆర్ ప్రతిని అందజేశాడు.


