నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్
రుద్రూర్: నేరాల నియంత్రణ కోసమే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. కోటగిరిలోని వినాయకనగర్ కాలనీలో గురువారం ఉదయం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లలో సోదాలు నిర్వహించి వాహనాల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఒక ఆటో, 42బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను కట్టించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. వాహనాలు ఉన్న వారు అన్ని ధ్రువీకరణ పత్రాలు కల్గి ఉండాలన్నారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు సహకరించాలని స్థానికులకు సూచించారు.
జోజిపేటలో ఆల్ఫ్రాజోలం పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని జోజిపేట్ గ్రామంలోగల కల్లు డిపో వద్ద నందిపేట ఎస్సై రామ్ గురువారం పోలీస్, ఎకై ్సజ్ సిబ్బందితో దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫ్రాజోలం 167.5 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్సై రామ్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు కల్లుడిపోపై దాడులు నిర్వహించి, మత్తు పదార్థాలను పట్టుకున్నామన్నారు. సికోటి రవీందర్ గౌడ్, బత్తిని భరత్ కుమార్ గౌడ్, ధర్మేందర్ లను అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడు జయవర్ధన్ గౌడ్ పరారీలో ఉన్నాడని, వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దొరికిన మత్తు పదార్థం విలువ సుమారు రూ. ఒక లక్ష 67వేలు ఉంటుందని వెల్లడించారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండల కేంద్రంలో ఎండు గంజాయిని అమ్ముతున్న అర్జున్ అనే వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. విశ్వసనీ య సమాచారం మేరకు డోంగ్లీలోని అంబాలాల్ అ ర్జున్ ఇల్లును సోదా చేయగా 150 గ్రాముల ఎండు గంజాయి దొరికిందన్నారు.ఇట్టి గంజాయిని స్వా
ధీనం చేసుకొని అర్జున్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని తెలిపారు. ఎస్సై నాగే
ష్, కానిస్టేబుళ్లు పరుశురాం, నవీన్‌రెడ్డి శ్రీకాంత్ ఉన్నారు.
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్


