దరఖాస్తుల ఆహ్వానం
బోధన్: పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతంలో గల సాలూర మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వరీ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఇంగ్లీష్, జనరల్ సైన్స్ (టీజీటీ– ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) ఖాళీ గా ఉన్నాయని, దరఖాస్తులకు ఎంఏ (ఇంగ్లీష్) బీ ఈడీ, టెట్ క్వాలిఫికేషన్, జనరల్ సైన్స్, బీఎస్సీ, బీఈడీతో పాటు టెట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పాఠశాలలోరెండు రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9154102684, 7893454070ను సంప్రదించాలని సూచించారు.
ఖలీల్‌వాడి: అన్ని భాషలకంటే మాతృబాష గొప్పదని, ఎన్ని భాషలు నేర్చుకున్న మాతృభాషతోనే హృదయ వికాసం కలుగుతుందని, దానితో జీవితం ధన్యమవుతుందని డీఈవో అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో గురువారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల సందర్బంగా పండిత్ పరిషత్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. భాషలలో ప్రావీణ్యం సాధించడానికి ఇలాంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా పండిత్ పరిషత్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


