ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలి
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా అక్రమంగా ఇసుక లేదా గ్రావెల్ తవ్వకం, రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే సుమోటో కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇసుక నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా, నియంత్రితంగా అమలు కావాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


