ప్రసూతి సేవలకు మంగళం | - | Sakshi
Sakshi News home page

ప్రసూతి సేవలకు మంగళం

Feb 27 2026 4:11 AM | Updated on Feb 27 2026 4:11 AM

ప్రసూతి సేవలకు మంగళం

ప్రసూతి సేవలకు మంగళం

ప్రతిపాదనలు పంపించాం..

వీవీపీలో విలీనమైనా..

మోర్తాడ్‌: మోర్తాడ్‌లోని కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లో మూడున్నర ఏళ్లుగా గర్భిణులకు ప్రసూ తి సేవలు అందడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడానికి ‘మార్పు’ కార్యక్రమాన్ని చేపట్టినా మోర్తాడ్‌లోని సీహెచ్‌సీ పరిస్థితి మాత్రం మారడం లేదు. గైనకాలజిస్టు(సీ్త్ర వైద్య నిపుణులు), అనస్థీషియా(మత్తు) వైద్యులు రాకపోవడంతో ప్రసవ సేవలు నిలచిపోయాయి. దీంతో ఈ ప్రాంత గర్భిణులు ప్రసవం కోసం ఆర్మూర్‌, మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు లేదా ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

ప్రయివేట్‌ వైద్యులను రప్పించి..

ఇక్కడి ఆస్పత్రిలో వైద్యులు ఉన్నా వారిలో గైనకాలజిస్టు, అనస్థీషియా వైద్యులు లేకపోవడంతో ఆర్మూర్‌ నుంచి ప్రయివేటు వైద్యులను పిలిపించి వారితో శస్త్ర చికిత్సలు చేయించాల్సి వచ్చింది. ప్రతి బుధ, శుక్ర వారాల్లో గర్భిణులకు శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవం చేశారు. శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేసినందుకు గైనకాలజిస్టుకు రూ.2,500 అనస్థీషియాకు రూ.2,500ల చొప్పున చెల్లించేవారు. సీ్త్ర వైద్య నిపుణులు, మత్తు వైద్యులకు ప్రభుత్వం చెల్లించే పారితోషికం తక్కువగా ఉండటంతో వైద్యులు ఆసక్తి చూపలేదు. క్రమక్రమంగా ప్రభుత్వం వైద్యులకు ఇచ్చే పారితోషికం అంశంను మరుగున పడవేయడంతో వైద్య సేవలకు మంగళం పలికినట్లు అయ్యింది. ఎంతోమంది పేదలు, మధ్య తరగతి కుటుంబాల వారు ప్రసవం కోసం మోర్తాడ్‌ ఆస్పత్రికి వస్తుండగా ఇక్కడ ప్రసవ సేవలు చేయకపోవడంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్మూర్‌, మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవం కోసం వెళుతున్నారు. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రయివేటు ఆస్పత్రులలో భారీగా ఫీజు వసూలు చేస్తుండటంతో పేదలకు, మధ్య తరగతి కుటుంబాల వారికి ఆర్థిక భారం ఏర్పడుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోర్తాడ్‌ ఆస్పత్రిలో ప్రసూతి సేవలను పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు.

మోర్తాడ్‌ ఆస్పత్రిలో సిజేరియన్‌ డెలివరీల కోసం ప్రతిపాదనలు పంపించాం. వైద్యుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. నిధులు కూడా అవసరం ఉంది. త్వరలోనే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. సీ్త్ర వైద్య నిపుణులు, మత్తు వైద్యుల నియామకం పూర్తి కాగానే ప్రసవ సేవలు అందిస్తాం.

– డాక్టర్‌ వివేక్‌, సీహెచ్‌సీ వైద్యాధికారి, మోర్తాడ్‌

మోర్తాడ్‌ ఆస్పత్రిని వైద్య విధానపరిషత్‌లో విలీనం చేశారు. అయినా ఆస్పత్రిలో సేవలు మె రుగుపడలేదు. మోర్తాడ్‌ సీహెచ్‌సీ పరిధిలో మో ర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, వేల్పూర్‌, మండలాలు ఉన్నాయి. సాధారణ ప్రసవాలను చౌట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నారు. శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను మాత్రం మోర్తాడ్‌లోని కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌లోనే నిర్వహించాల్సి ఉంది. 2018లో మోర్తాడ్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు ప్రారంభించారు. మార్పు పథకం అమలుతో మోర్తాడ్‌ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగాయి.

మోర్తాడ్‌ సీహెచ్‌సీలో మూడున్నర ఏళ్లుగా నిలిచిన వైనం

ప్రయివేట్‌ లేదా ఆర్మూర్‌ ఆస్పత్రికి వెళుతున్న గర్భిణులు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement