‘లయన్స్’ ఉత్తమ జోన్ చైర్మన్‌గా విజయానంద్
నిజామాబాద్ రూరల్: ఇందూర్ లయన్స్ క్ల బ్‌కు చెందిన జిల్కార్ విజయానంద్ ఉత్తమ జోన్ చైర్మన్ అవార్డు, డిస్ట్రిక్ట్ గవర్నర్ మెడల్ పొందారు.సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవన్ లో ఆదివారం నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఈ ఎంపవర్ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఆయనకు డిస్ట్రిక్ట్ గవర్నర్ నగేశ్ పంపాటి అవార్డును అందజేశారు. 2024–25 సంవత్సరంలో జోన్ పరిధిలోని ఇందూర్, కామారెడ్డి, కామారెడ్డి వివేకానంద, సదాశివనగర్ క్లబ్బుల్లో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని విజయానంద్ తెలిపారు. లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఘట్టమనేని బాబురావు, సూర్యరాజ్, గవర్నర్ అమర్నాథ్ రావు, విజయలక్ష్మి, నరసింహ రాజు, ప్రవీణ్ మర్రి, శ్రీధర్, మధు, వివిధ లయన్స్ క్లబ్‌ల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: సీఎం కప్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు మూడో రోజు ఆదివారం కొనసాగాయి. ఉదయం నిర్వహించిన బాలికల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కరీంనగర్ పై, నిజామాబాద్ జట్టు మహబూబ్‌గర్ పై, రంగారెడ్డి జట్టు మేడ్చల్ మల్కాజిగిరి పై, జగిత్యాల జట్టు వరంగల్ పై విజయం సాధించి సెమీఫైనల్స్ చేరాయి. క్వార్టర్స్ బాలుర విభాగంలో హైదరాబాద్ జ ట్టు మహబూబ్‌నగర్ పై, మహబూబాబాద్ జ ట్టు ఆదిలాబాద్ పై, రంగారెడ్డి జట్టు నిజామాబాద్ జట్టు పై, జగిత్యాల జట్టు కరీంనగర్ పై, బాలికల విభాగంలో హైదరాబాద్–రంగారెడ్డి, బాలుర విభాగంలో రంగారెడ్డి–హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి పద్మ క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
నేడు ఫైనల్ మ్యాచ్
సీఎం కప్ బాస్కెట్‌బాల్ రాష్ట్ర స్థాయి ఫైనల్ మ్యాచ్ సోమవారం నిర్వహించనున్నారు. మ్యాచ్‌లో బాలికల విభాగంలో రంగారెడ్డి, హైదరాబాద్, బాలుర విభాగంలో రంగారెడ్డి–హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం సీఎం కప్ బాస్కెట్‌బాల్ రాష్ట్ర స్థాయి క్రీడలు ముగింపు జరుగనుంది.
చిరుత దాడులతో
బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
లింగంపేట: మండలంలోని ఎల్లమ్మ తండా, బూరుగిద్ద, గాంధీనగర్, మోతె, బట్టిప్పగడ్డ తండా, ఎల్లారం తదితర గ్రామాల ప్రజలు చిరుత వరుస దాడులతో బెంబేలెత్తుతున్నారు. వారం రోజులుగా రోజుకు రెండు దూడల చొప్పున దాడి చేసి హతమారుస్తున్నాయి. ఆయా గ్రామాలు, తండా శివారులోని పంట చేనుల వద్ద పశువుల కొట్టాలను టార్గెట్ చేసుకొని రోజు దాడులకు పాల్పడుతున్నాయి. ఆయా గ్రామాల శివారులో సుమారు నాలుగు చిరుతలు ఉన్నట్లు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి చెట్లపై పడుకొని తెల్లారిన తర్వాత అటవీ ప్రాంతాలకు వెళ్తున్నట్లు రైతులు గుర్తించారు. దీంతో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. శనివారం రాత్రి ఎల్లమ్మ తండాకు చెందిన సభావత్ రవికి చెందిన లేగదూడ, గేదెను హతమార్చినట్లు బాధితుడు తెలిపాడు. అలాగే బట్టిప్పగడ్డకు చెందిన మాలోత్ దేవీసింగ్ దూడను సైతం హతమార్చినట్లు తండా వాసులు తెలిపారు. వారం రోజులుగా వరుస దాడులతో రైతులకు, పశుపోషకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆర్థికంగా రూ. లక్షలు నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చిరుతలను బంధించాలని ఆయా గ్రామాలు ప్రజలు, తండావాసులు కోరుతున్నారు.
‘లయన్స్’ ఉత్తమ జోన్ చైర్మన్‌గా విజయానంద్
‘లయన్స్’ ఉత్తమ జోన్ చైర్మన్‌గా విజయానంద్


