మూడు ఆలయాల్లో చోరీ
నవీపేట: మండల కేంద్రంలోని మూడు ఆలయాల్లో దుండగులు శనివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. అయ్యప్ప ఆలయ తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడి ముందు ఉన్న హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అర తులం బంగారు, రెండు తులాల వెండి ఆభరణాలు, హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే పక్కనే ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లి అందులో ఉన్న నగదును దొంగిలించి హుండీలను శివారులోని పంట పొలాల్లో పడేశారు. క్లూస్ టీమ్ ఆలయాల్లో వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
నిజామాబాద్ రూరల్: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో అర్బ న్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ పా ర్టీ అధ్యక్షుడు కులాచారి దినేశ్, నాయకులు రాష్ట్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికై న ఇప్ప ఉమారాణి సోమవారం ఉదయం 10: 30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యాలయం మొదటి అంతస్తులో ఆమె కోసం ప్రత్యేక చాంబర్‌ను సిద్ధం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆమె పరిచయ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత పట్టణంలోని ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం జరుపనున్నారు.
మూడు ఆలయాల్లో చోరీ


