మహాత్ముల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
డిచ్‌పల్లి: మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ లాంటి మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసు కుని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్ముల విగ్రహాల ను గ్రామంలో ప్రతిష్టించుకుంటే వారి భావజాలం మనలో చైతన్యం రేకేత్తిస్తుందన్నారు. బర్ధిపూర్ గ్రా మంలో ఇళ్లు లేని అర్హులకు కట్టిస్తామని, గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నా రు. అనంతరం దళిత సంఘం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోట్ల భాస్కర్, సర్పంచుల ఫోరం రూరల్ మండల అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, ఉప సర్పంచ్ తోట మహేశ్, అంబేడ్కర్ సంఘం బర్ధిపూర్ అధ్యక్షుడు జెల్ల బాబు, జాంపండ్ల నర్సయ్య, సాయిలు, చందు, జమున శివకృష్ణ, నీరడి పద్మారావు, గంధం భాస్కర్, నీరడి దేవరాజ్, మేక కృష్టారెడ్డి, పెంటాజి, ఈగ నారాయణరెడ్డి, సామ్సన్, ఆనంద్, ధర్మాగౌడ్, రాజేశ్వర్, మహేశ్, దళిత సంఘం సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి


