బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
● మన్ కీ బాత్ కార్యక్రమాన్ని
పార్టీ నాయకులతో కలిసి వీక్షించిన
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ రూరల్: భారతీయ జనతా పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని టీవీలో ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన్ కీ బాత్ అంటే దేశ ప్రజలతో ప్రధాని మోదీ ప్రత్యక్ష సంభాషణ నిర్వహించే కార్యక్రమమని అన్నారు. ప్రత్యేకంగా గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. అవయవ దానం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించిన విషయాలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. జిల్లా పదాధికారులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా ప్రభరి విక్రం రెడ్డి, యువ మోర్చా ప్రతినిధులు, మహిళా మోర్చా సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు.


