దేశ సమైక్యత కోసం ఆర్‌ఎస్‌ఎస్ నిర్విరామ కృషి
● సమాజ పరివర్తన కోసం పాటుపడాలి
● విభాగ్ కార్యవాహ రాజుల్వర్ దిగంబర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్లలో అనేక సామాజిక కార్యక్రమా లు నిర్వహించడంతోపాటు దేశ సమైక్యత కోసం నిర్విరామంగా కృషి చేసిందని విభాగ్ కార్యవహ రాజుల్వర్ దింగబర్ పేర్కొన్నారు. బుధవారం ఇందూరు నగరంలోని శ్రీరామ్ ఉపనగరంలో సంఘ శతాబ్ది సంక్రాంతి ఉత్సవం జనార్దన్ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ ఉత్సవంలో ప్రధాన వక్తగా హాజరైన రాజుల్వర్ దిగంబర్ మాట్లాడారు. శతాబ్ది వేడుకల ద్వారా సంక్రాంతి పండుగ సమరసత సందేశాన్ని ప్రతి హిందువు కుటుంబానికి అందజేయాలని కోరారు. హిందూ సమాజంలో అంటరానితనం లేదన్నారు. శ్రీరాముడు గుహుడితో స్నేహం చేయడం, శబరి ఇచ్చిన ఎంగిలి పళ్లను తినడం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లాంటి అంశాలు సనాతన జీవన విధానంలోని సమరసతకు నిదర్శనాలన్నారు.
ప్రతి పౌరుడు పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన కోసం పాటు పడాలన్నా రు. కార్యక్రమంలో నగర కార్యవహ అరుగుల సత్యం, సహ కార్యవహ సుమిత్, అనిల్, అభిరామ్, శ్రవణ్, మృత్యుంజయ, నరేశ్ తదితరులు పాల్గొ న్నారు.


