చైనా మాంజా విక్రయించిన ముగ్గురిపై కేసు
ఆర్మూర్‌టౌన్: నిషేధిత చైనా మంజా విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. పట్టణంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న నారాయణ, రవిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 18,500 విలువ గల చైనా మాంజాను స్వా ధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో హోల్‌సేల్‌గా అమ్ముతున్న జహీర్‌ఖాన్‌ను సైతం అదుపులో తీసుకొని ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో ఒకరు...
నిజామాబాద్ అర్బన్: చైనా మాంజా విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. నగరంలోని పోస్టు ఆఫీస్ వెనుక సుల్తాన్ కై ట్ షాపులో సయ్యద్ అస్లాం అనే వ్యక్తి 18 మాంజా చుట్లు విక్రయిస్తున్నారని తెలుసుకొని, అతనిని అరెస్టు చేశామన్నారు. సయ్యద్ అస్లాంతోపాటు దుకాణం యజమాని ఫహీం అన్సారీపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


